జగన్ భార్యపై టీడీపీ మహిళానేత విమర్శలు
అక్రమాస్తుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో జగన్ భార్య వైఎస్ భారతి సీబీఐ అధికారిని బెదిరిస్తున్న రీతిలో ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని టీడీపీ మహిళానేత శోభా హైమావతి తప్పుబట్టారు. ఓ అధికారి పట్ల ఆవేశం ప్రదర్శిస్తూ 'నీకు పిల్లల్లేరా?' అంటూ శాపనార్థాలు పెట్టడం భారతికి తగదని హైమావతి హితవు పలికారు. ఓ పత్రికకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తికి కోర్టు హాల్లో మాట్లాడకూడదన్న విషయం తెలియకపోవడం శోచనీయమని హైమావతి పేర్కొన్నారు.